Breaking News

భారత ప్రధాన న్యాయమూర్తి బోబ్డే తల్లికే టోకరా

2.5 కోట్లకు టోపీ పెట్టిన కేర్‌టేకర్‌

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) శరత్‌ అరవింద్‌ బాబ్డే తల్లినే నమ్మించి మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాబ్డే తల్లి ముక్తా అరవింద్ బోబ్డే అస్తుల కేర్‌ టేకర్‌గా ఉంటున్న వ్యక్తి ఏకంగా 2.5 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు తపస్ ఘోష్(49)ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగపూర్‌లోని జస్టిస్ బాబ్డే తల్లి ఆస్తులకు తపస్‌ గత10ఏళ్లుగా కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నాడు. వీటిల్లో ప్రధానంగా సిటీలోనే ప్రముఖ ఫంక్షన్ హాళ్లలో ఒకటి కావడంతో అదెప్పుడూ బిజీగా ఉండేది. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన ముక్తాకు తప్పుడు లెక్కలు చెబుతూ ఏళ్ల తరబడి గోల్‌మాల్ వ్యవహారాలు చేశాడు తపస్. అయితే లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించిన ముక్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఘోష్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం ఈ నెల 16 వరకు రిమాండ్‌కు తరలించారు.
సిట్ ఏర్పాటు
సీజేఐ జస్టిస్ బోబ్డే తల్లిని ఫ్యామిలీ కేర్ టేకర్‌ మోసం చేశాడన్న కేసు విచారణకు డీసీపీ వినితా సాహు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. దర్యాప్తులో కేసు లోతుపాతుల్ని పరిశీలించారు. ఈ మేరకు గడిచిన కొన్నేళ్లుగా తపస్ ఘోష్ రూ.2.5కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *