Breaking News

విజయవాడ మూడవ పట్టణ ట్రాఫిక్ పోలిస్టేషన్ లో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు

తెలుగు తేజం, విజయవాడ : నిత్యం నగరంలోని ట్రాఫిక్ నియంత్రణ లో తల మునకలై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు ఒకచోట చేరి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగర మూడవ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు అధికారులు వేకువజామునే ఒకచోట చేరి సెమీ క్రిస్మస్ సంబరాలు నిర్వహించుకున్నారు. ట్రాఫిక్ పోలిస్టేషన్ పరిధిలోని సిఐలు బాలరాజు రెడ్డి ; దుర్గారావు లు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి తోటి సిబ్బందికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా సెమి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ అని ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా సిఐ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ లు సత్యనారాయణ, రమణ సిబ్బంది ఏ ఎస్ ఐ.కృష్ణా, సిబ్బంది పాల్గొని ప్రతి ఒక్కరికి సెమి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపుకున్నారు. అనంతరం అల్పాహార విందు ఏర్పాటు చేసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *