Breaking News

రాఘవాచారి ఉద్యానవనం ప్రారంభించిన హోం మంత్రి సుచరితకు ఏపీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు

తెలుగు తేజం,విజయవాడ : సీనియర్ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు సీ రాఘవాచారి ఉద్యానవనాన్ని సింగ్ నగర్ లో రాష్ట్ర హోం మినిస్టర్ మేకతోటి సుచిరిత ప్రారంభించారు. ఈ ఉద్యానవనం ఏర్పాటులో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా రాఘవాచారి పేరుతో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దారం వెంకటేశ్వరరావు మంత్రి సుచరితకు, ఎమ్మెల్యే విష్ణు, కమిషనర్ వెంకటేష్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పుష్పగుచ్చాలు, యూనియన్ డైరీ అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *