తెలుగు తేజం, మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ నెల 18వ తేదీ మచిలీపట్నం రానున్నారని కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భాషా సంఘం అధ్యక్షులు గడ్డ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షతన సంఘ సభ్యులు ఆచార్య చందు సుబ్బారావు మోదుగుల పాపి రెడ్డి ఆచార్య షేక్ మస్తాన్ మరియు ఆచార్య శరత్ జ్యోత్స్న రాణి లతో కూడిన బృందం మచిలీపట్నం బుధవారం విచ్చేసి 10 గంటలకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగే సమావేశమునకు హాజరై జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో తెలుగు భాష అమలు తీరు పరిశీలిస్తారని తెలిపారు.