విజయవాడ : విజయవాడలో భారీ కొండ చిలువ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. వివరాలులోకెళ్తే వచ్చే నాగులు చవితి ని పురస్కరించుకుని కాలువ వెంబడి ఉన్న పుట్టలపై ఉన్న పిచ్చి మొక్కలను కూలీలు తొలగిస్తున్నారు. ఇదే తరుణంలో ఓ పెద్ద పాము కనపడిందని పనిచేస్తున్న వ్యక్తి కేకలు వేయడంతో దీంతో అక్కడ వెళ్లి అందరూ చూడగా ఓ పెద్ద భారీ పైతన్ కదులుతూ ఉండటం గమనించారు.. దీంతో ఇరిగేషన్ ఏఈ ఈ అంజుమన్ కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వారు అక్కడ చేరుకుని వారి కొండచిలువ ను కష్టపడి పట్టుకున్నారు. ఒకటే ఉందా… ఈ ప్రాంతంలో ఇంకేమైనా ఉన్నాయని ఆలోచనతో ఉన్నారు. కాల్వ గట్టుపై ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ ఏఈ కోరారు. ఇంత భారీ కొండచిలువ ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీసుతున్నారు. కాల్వలోని నీటి ప్రవాహానికి వచ్చి ఉంటుందని అంచనా…?