Breaking News

విజయవాడ హైవేపై స్తంభించిన ట్రాఫిక్‌

విజయవాడ : వరుణుడి ప్రతాపానికి అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో సమీప చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లష్కర్‌ గూడ చెరువు ఉద్ధృతికి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరదనీరు చేరింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ ప్రాంతంలో జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటం, రహదారి దెబ్బతినడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు, అటు కొత్తగూడెం వరకు ఎన్‌హెచ్‌ 65పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వరదనీటి కారణంగా నిలిచిపోయాయి. శనివారం చేపట్టిన రహదారి మరమ్మతులు సైతం వరద కారణంగా ఆగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *