Breaking News

శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవం ఏర్పాట్ల గురించి సమన్వయ కమిటీ సమావేశం

తెలుగుతేజం. పెనుగంచిప్రోలు : శ్రీతిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఫిబ్రవరి 26 2021 నుండి మార్చ్ ౦౨ వ వరకు జరగబోవు పెద్ద తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఏర్పాట్ల గురించి తాహశీల్దార్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో యన్ వి యస్ యన్ మూర్తి మాట్లాడుతూ కోవిడ్ను దృష్టిలో ఉంచుకొని దీక్ష స్వాములకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, ఇందుకుగానూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కలిసి పనిచేయాలని, సంబంధిత శాఖల వారికి ఏవైనా అవసరాలు ఉంటే వెంటనే తెలియపరచాలని, గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ తిరునాళ్ల మహోత్సవం ని ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు ప్రమాదాలను పసిగట్టి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే శానిటేషన్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అతి ముఖ్యంగా కోవిడ్ కారణంగా గత కొంత కాలం నుండి దేవాలయంలో అన్నదాన కార్యక్రమము నిలుపుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే నని, దీక్ష స్వాములకు మరియు భక్తులకు కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి తిరునాళ్ళు వస్తున్నటువంటి భక్తులకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుండి భక్తులు రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, అలాగే పోలీసు వారు శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు. ఎక్సైజ్ పోలీస్ శాఖ వారు అక్రమ మద్యం వ్యాపారం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. గవర్నమెంట్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని 104 మరియు అంబులెన్స్ అందుబాటులో ఉంటాయని, గత ఐదు సంవత్సరాల నుండి దేవాలయం ఈ ఓ కు ఆక్సిజన్ జనరేటర్ కావాలని కోరామని కానీ ఆక్సిజన్ జనరేటర్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్సిజన్ జనరేటర్ సౌకర్యాన్ని డాక్టర్లకు కల్పించాలని కోరారు. అలాగే మందులను ఒక రోజు ముందే వారికి అప్పగించాలని కోరారు. అలాగే కోవేట్ కారణంగా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలని దేవాలయం నుండి మాస్కులు కూడా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. డి యస్ పి నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ళకు బొచ్చు భక్తులకు మరియు దీక్ష స్వాములకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, అలాగే ఎన్ సి సి, మరియు ప్రైవేట్ సిబ్బందిని తీసుకొని ఈ తిరునాళ్ల మహోత్సవం ని విజయవంతం చేయటానికి మా వంతు కృషి చేస్తామని అన్నారు. ప్రైవేటు సిబ్బందికి ప్రత్యేక టీషర్ట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రత్యేకంగా మూడు కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్ బి వాణి మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆర్టీసీ బస్సులను పెడతామని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మధిర, ఖమ్మం ఆర్ టి సి డిపో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రాల నిబంధనల ప్రకారం బస్సులు నడుపుటకు ఆర్టీవో అధికారులతో సంప్రదింపులు జరపాలని అందుకుగాను దేవాలయం వారు ఈ అవకాశాన్ని కల్పించాలని అన్నారు. ఆర్టీవో అధికారులు మాట్లాడుతూ దేవాలయం అధికారి కోరిన విధంగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. చివరిగా తాసిల్దార్ షఖి మనీషా బేగం మాట్లాడుతూ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ళకు అన్ని శాఖల సమన్వయంతో దీక్ష స్వాములకు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్,యస్ ఐ రామకృష్ణ, ఏ ఈ ఓ శ్రీనివాస రావు, ఆలయ సిబ్బంది, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, హోమ్ గార్డ్స్, గ్రామ పోలీస్ సిబ్బంది మీడియా మిత్రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *