Breaking News

షాబుఖారి ఆస్థానానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్

తెలుగు తేజం, కొండపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మంగళవారం కొండపల్లిలో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం హజరత్ సయ్యద్ షాఋఖారి ఆస్థానానికి విచ్చేశారు. షాఋఖారి ఆస్థాన పీఠాధిపతి హజరత్ మహమ్మద్ అల్తాఫ్ రజా బాబా ఆయనను సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం సన్మానించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ షాఋఖారి ఆస్థానానికి విచ్చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఇక్కడ జరిగే నిత్య అన్నదాన కార్యక్రమం ఒక గొప్ప మహత్కార్యం అని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న అల్తాఫ్ బాబా కారణజన్ములు అని కొనియాడారు. అనంతరం అల్తాఫ్ బాబా తోలేటి శ్రీకాంత్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబాగారి ప్రసాదాలు అందించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *