తెలుగు తేజం, మైలవరం : సమర్ధులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి మన సత్తా చాటాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు సూచించారు. బుదవారం మైలవరం పార్టీ కార్యాలయం లో జి కొండూరు మండల ముఖ్య నాయకులతో గ్రామాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ గా పోటీచేసే అభ్యర్థుల గురించి చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి మన సత్తా చాటాలని నాయకులకు విజ్ణప్తి చేశారు.ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా గ్రామాల్లోని నాయకులు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.