తెలుగు తేజం, జగ్గయ్యపేట : కృష్ణ జిల్లా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ పేరున నకిలీ పేస్ బుక్ ఐడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించారని జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ తెలిపారు. చంద్రపుల్లా అనే పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడి తయారు చేసి ఆ ఐ డి ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతున్నట్లు ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినవారికి గుర్తు తెలియని వ్యక్తులు అనారోగ్యంగా ఉందని రూ.10,000/- లు పంపాలని తాను అడుగుతున్నట్లు వారు ఇతరులకు ఫోన్ చేస్తున్నారన్నారు. ఈ సమాచారం నా దృష్టికి కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి తెలపగా ఆ పేస్ బుక్ ఐడి నకిలీదని గుర్తించి చంద్రపుల్ల పేరు మీద ఎవరైనా పేస్ బుక్ నుండి రిక్వెస్ట్ గాని మెసేజ్ గాని చేస్తే తన దృష్టికి తీసుకురావాలని చంద్రశేఖర్ కోరారు. ఇలాంటి నకిలీ పేస్ బుక్ ఐడి ల ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ లను నమ్మొద్దని ఆయన తెలిపారు.