రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత : నందిగామ రవాణా శాఖ అధికారిణీ ఆయేషా ఉస్మాని
తెలుగు తేజం, నందిగామ : జాతీయ భద్రతా మాసోత్సవం లో భాగం గా కృష్ణాజిల్లా, నందిగామ గాంధీ సెంటర్ లో రోడ్డు ప్రమాదాలు నివారణకు వాహనచోదకులు నియమ నిబంధనలతో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అతివేగం ప్రమాదకరం అని రవాణా శాఖ అధికారిణీ ఆయేషా ఉస్మానిపలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతోపాటు నియమ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేస్తే ప్రమాదాలనునియంత్రించ వచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఉద్యోగులు శ్రీనివాసాచారి రాజబాబు ఏఎస్ఐ నాగేశ్వరావు పలువురు డ్రైవింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.