Breaking News

హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మూర్తి

తెలుగుతేజం, హనుమాన్ జంక్షన్ ప్రతినిధి:
నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా అల్లు నవీన్ నరసింహా మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం అధికారకంగా ఉత్తర్వులు వెలువడినట్లు తెలుస్తుంది. హనుమాన్ జంక్షన్ సర్కిల్ కు బదిలీపై వస్తున్న మూర్తి ప్రస్తుతం రాజమండ్రి వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. మూర్తి గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని మచిలీపట్నం రూరల్, నందిగామ రూరల్, అవనిగడ్డ, పశ్చిమగోదావరి జిల్లా పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేశారు. మూర్తి గురువారం లేదా శుక్రవారం హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. గతంలో హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేసిన సతీష్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విఆర్ కు వెళ్లారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *