విజయవాడ (తెలుగుతేజం ప్రతినిధి) : దివంగత నేత అపర భగీరధుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి 13వ వర్థంతి వేడుకలు గుణదల ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఉద్దంటి సునీతా సురేష్ మాట్లాడుతూ మహిళలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన నేత డాక్టర్ రాజశేఖర్రెడ్డి అని ఆయన స్ఫూర్తితో, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రోద్బలంతో తాను రాజకీయ ఆరంగేట్రం చేశానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ వర్ధంతి వేడుకల సందర్భంగా పేదలకు, వృద్ధులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు వైయస్ఆర్ సీపీ నాయకులు ఉద్దంటి సురేష్, డివిజన్ వైయస్ఆర్ సీపీ నాయకులు, నాయకురాళ్ళు పాల్గొన్నారు.