తెలుగు తేజం, విజయవాడ : విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గుగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. కృష్ణా నది తీరంలో గతంలో ఉన్న 9 ఆలయాలను 2016 పుష్కరాల సమయంలో తొలగించారు. ప్రస్తుతం వాటిని తిరిగి అదే స్థానంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పునర్నిర్మించే ఆలయాలు ఇవీ..
- రాహు – కేతు ఆలయం
- సీతమ్మ పాదాలు
- దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో)
- శనైశ్చర ఆలయం
- బొడ్డు బొమ్మ
- ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద)
- సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం
- వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో)
- కనకదుర్గ నగర్లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల