Breaking News

విశ్వనగరంగా హైదరాబాద్‌ : కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిప్‌ కార్పొరేషన్‌ సహా నాలుగు చట్టాల సవరణ కోసం అసెంబ్లీ భేటీ అయింది. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే.. భూముల ధర నిర్ధారణకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్లకు 47 ఏ కింద ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్‌ స్టాంపు చట్టానికి సవరణ, వ్యవసాయ భూములను వ్యవసాయేతరాలుగా బదలాయించే ప్రక్రియలో అధికారులకు విచక్షణాధికారాలు లేకుండా ధరణి ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్ట సవరణ, గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లు, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ చట్టసవరణ బిల్లులను మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.

బిల్లులపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదిగేందుకు దూసుకుపోతోందన్నారు. ” 1955లోనే హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పడింది. 2015లోనే జీవో ద్వారా జీహెచ్‌ఎంసీలో 50శాతం స్థానాలను మహిళలకు కేటాయించాం. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత తెరాసదే. తెలంగాణలో 5 నుంచి 6శాతం పచ్చదనం పెరిగింది. పచ్చదనం కోసం 2.5శాతం నుంచి 10శాతానికి బడ్జెట్‌ పెంచేలా చట్టసవరణ చేశాం” అని కేటీఆర్‌ వివరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *