అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటలపాటు సాగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‌లను ఒకే సంస్థకు, అదీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం వేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. అంతేకాకుండా అగ్నిమాపక శాఖలో నాలుగు జోన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. ఇప్పటివరకు రెండుజోన్లుగా ఉన్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలను సౌలభ్యం కోసం 4 జోన్లుగా విభజన చేయాలని నిర్ణయించింది. కొన్ని జైలు సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది. ఆదోనిలోని 2 వర్గాల ఘర్షణ కేసులను వెనక్కి తీసుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించింది.