తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణ పరిధిలోని టిడ్కొ గృహాలు పొందిన లబ్ధిదారులతో నవంబర్ 24న మంగళవారం ఉదయం 10 గంటలకు పాత మున్సిపల్ ఆఫీసు ఎదురుగా గల ఉక్కు కళావేదిక నందు సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొంటారని వారి చేతుల మీదగా గృహాల లబ్ధిదారులకు అలాట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరుగుతుందని, పట్టణ పరిధిలోని వాలంటీర్ల అందరూ తమ పరిధిలో లబ్ధిదారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు, మరియు ఇల్లు పొందినవారిలో 300 చదరపు అడుగుల లో గృహాలు పొందినవారికి వాటిని 1రూపాయికె ఇవ్వడం జరుగుతుందని, పట్టణ పరిధిలో ఇవి సుమారు 1521 ఇల్లు ఉన్నవని, ఆపై 365 చదరపు అడుగుల లో గృహాల పొందినవారు నాలుగు విడతలు గా (12500*4) 50000 చెల్లించాల్సి ఉంటుందని, 430 చదరపు అడుగుల లో గృహాలు పొందినవారు లక్ష రూపాయలను లబ్ధిదారుని వాటాగా నాలుగు సార్లు పాతిక వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, గతంలో చెల్లించిన వారు చెల్లించాల్సిన అవసరం లేదని, చెల్లించని వారు లబ్దిదారుని వాటా లో గతంలో చెల్లించిన సొమ్ము తీసివేసి మిగిలిన సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని, మరియు బ్యాంకు రుణాలు కూడా లబ్ధిదారులు చెల్లిస్తామని హామీ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.