తెలుగు తేజం, కంచికచర్ల : వైఎస్ఆర్ క్రాంతి పథకం డి ఆర్ డి ఎ వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల మండల సమాఖ్య కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి పేరం జ్యోతి అధ్యక్షతన బ్యాంకు అధికారులు, మరియు వివిధ కంపెనీల ఆఫీసరుల సమక్షంలో వైఎస్సార్ చేయుత 51 మంది లబ్దిదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయస్ఆర్ చేయుత లో భాగంగా 51 మంది లబ్దిదారులు కిరాణా దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలు సాధ్యమైనంత వరకు తమ కాళ్ళపై తాము నిలబడాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయుత తీసుకురావడం జరిగిందని, మహిళలు రాజాకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందు ఉండాలనే ఉద్దేశంతో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కలిపించారని , మగవారితో సమానంగా మహిళలు రాణించాలనే ధృడ సంకల్పంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని జ్యోతి తెలిపారు. ప్రతి మహిళ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో యస్. బాలకృష్ణ సేల్స్ ఆఫీసర్, హెచ్ యు ఎల్ , డి. నాగేశ్వరరావు, సేల్స్ ఆఫీసర్, రిలయన్స్ ,
జి.వెంకన్న సేల్స్ ఆఫీసర్, రిలయన్స్ జియో, యస్ విజేయ్ సేల్స్ మేనేజర్ , ఐటిసి ప్రతినిధులుగా హాజరై వ్యాపార సమయంలో ముఖ్యం గా సరుకులు కోనుగోలు అమ్మకాలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలుకువలు గురించి వివరించడం జరిగింది. కిరాణా దుకాణం వారిని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్న, ఈ కార్యక్రమంలో సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ వి. శ్రీనివాసరావు పాల్గోని లోన్ మంజూరు చేయడం మరియు రీపేమెంట్ గురించి వివరంగా లబ్దిదారులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి పేరం జ్యోతి, కోశాధికారి శ్రీమతి ముత్యాల రోజా రమణి, ఎ పి యం కె. శోభన్ బాబు, సిసిలు బిక్షాలు స్రవంతి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.