తెలుగు తేజం , కంచికచర్ల : కృష్ణా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆదేశాల మేరకు కంచికచర్ల ఫైర్ ఆఫీసర్ వై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వారి సిబ్బంది తో కలిసి కరోనా వైరస్ వ్యాప్తి పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కంచికచర్ల పట్టణంలో శుక్రవారం పలుచోట్ల అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పట్టణంలోని పలు ప్రధాన కూడలిల వద్ద జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మరియు పెట్రోల్ బంక్ లు, టీ స్టాల్ లు, స్కూలు, కాలేజీ లోని విద్యార్థులకు కరోనా పై అవగాహన కల్పించారు. అలాగే పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఉన్న స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ వై నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అధికారి సూచనల మేరకు కంచికచర్ల పట్టణంలో కరోనా పై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈరోజు స్థానిక పెట్రోల్ బంక్ లు , విజయ రాణి స్కూల్, టీ స్టాల్స్ తదితర ప్రధాన రహదారుల వద్ద తమ సిబ్బంది చే ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని, సబ్బు లేక శానిటైజర్ తప్పక ఉపయోగించాలని, కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగిందని తెలిపారు.