తెలుగు తేజం, గుంటుపల్లి : గుంటుపల్లి గ్రామంలో రైతు సంఘాల సమాఖ్య ఆధ్వ్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎం ఆర్ ఒ సూర్యారావు మాట్లాడుతూ 1897 జనవరి 23 వ తేదీన ఒడిశాలోని కటక్ లో జానకినాధ్ బోస్ దంపతులకు జన్మించిన సుభాస్ చంద్రబోస్ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో, దేసాభిమానంతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని, 11 సార్లు జైలు కి వెళ్లి, దేశానికి స్వాతంత్రం తీసుకు రావడానికి కీలక పాత్ర పోషించిన మహా వీరుడు,సాయుధ పోరాటమే ధ్యేయమని, స్వాతంత్ర్య భారతావని మన స్వప్న మని బలంగా నమ్మి, ప్రతి భారతీయుడు సైనికుడిగా మారి ప్రాణాలు అర్పించాలని పిలుపు ఇచ్చిన ధీశాలి అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ని ఈ సంవత్స రం నుండి పరాక్రమ దివస్ గా జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో గుంటుపల్లి పంచాయతి సెక్రటరీ రామారావు, రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చెరుకూరి వేణుగోపాల రావు, రిటైర్డ్ ఎసిపి నర్రా నాగమల్లేశ్వరావు, గ్రామ పెద్దలు, విద్యార్థులు ,కృష్ణవేణి గ్రామైక్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.