తెలుగు తేజం, నందిగామ : కృష్ణాజిల్లా, నందిగామ జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు , నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నందిగామ పరిధిలోగ్రామ రక్షక దళాల సభ్యులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, మత పెద్దలు మరియు పట్టణ ప్రముఖుల సమక్షంలో గ్రామ రక్షక దళాల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలు ప్రార్ధనా మందిరాల పై జరుగుతున్న దాడులు, అరాచకాలను అరికట్టాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని దురదృష్ట సంఘటనలు, శాంతి భద్రతల సమస్యలు, దేవాలయాలు, మత సంస్థలు మొదలైన వాటిపై జరుగుతున్నా దాడుల నేపధ్యంలో ప్రజల భాగస్వామ్యంతో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి గ్రామం పరిధిలో గ్రామ రక్షక దళం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. అని అన్నారు. సిఐ కనకారావు మాట్లాడుతూ గ్రామ రక్షక దళాల విధి విధానాలు ఈ గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేయడం వలన సమాజానికి, ప్రజలకు కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చంద్రశేఖర్ ఎస్సైలు, ఎంపీడీవో సచివాలయ కార్యకర్తలు సిబ్బంది, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.