తెలుగు తేజం, నందిగామ : ఢిల్లీలో రైతుల చేసే పోరాటంపై కేంద్ర ప్రభుత్వం నిర్బంధకాండ, దాడులు చేయడం దుర్మార్గం. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, మరియు గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక నందిగామ పట్టణంలో చేతన్య కాలేజీ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. (ఎస్ఎఫ్ఐ – డివైఎఫ్ఐ) నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ప్రసన్న కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్. నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి మూడు చట్టాలు తెచ్చిందిని. ఆచట్టాల ప్రకారం పంటలకు మద్దతుధర ఉండవుని మరియు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం ఉచిత విద్యుత్ స్థానంలో మిటర్లు బిగించి నగదు బదిలీ పథకం ప్రవేశపెడుతుందిని. ఈచట్టం అమలు జరిగితే రైతులు దివాల తీస్తారని. కూలీలకు ఉపాధి పోతుందిని. బ్లాక్ మార్కెట్లు సంఖ్య పెరుగుతుంది. ప్రజల ఆహార భద్రత ముప్పు ఏర్పడుతుంది. సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని అన్నారు. ఢిల్లీలో రైతుల చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని, దేశవ్యాప్తంగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందిని ఈ ర్యాలీలో రైతులపై పోలీసులతో లాఠీచార్జి, మరియు దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. రైతు సంఘం నాయకుడు సైదులు ,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఏం. సోమేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మరియు విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, స్వామినాథన్ కమిషన్ సూచనల ఆధారంగా రైతులుకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని, రైతు రుణ విమోచన చట్టం చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 ఇవ్వాలి. దళితులపైన ,మహిళలపైన మైనార్టీలపైన జరుగుతున్న దాడులు అరికట్టాలి. మరియు కౌలు రైతుల రక్షణకు సమగ్ర చట్టాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలు రద్దుకై ఐదు లక్షల మందికి పైగా రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారని అన్నం పెట్టే రైతన్నను మోడీ సర్కార్ ఉగ్రవాదిగా ముద్ర వేయడం సరికాదని అన్నారు. రైతులపై అక్రమ కేసులు బనాయించడం జరుగుతుందని వెంటనే రైతులు సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు సుబ్బారావు, సీఐటీయూ మండల కార్యదర్శి కె.గోపాల్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఖాసిమ్, ఎస్ఎఫ్ఐ నందిగామ మండల అధ్యక్షు, కార్యదర్శిలు ఎస్.డి.లాల్ సలామ్, గోపినాయక్, చందర్లపాడు మండల కార్యదర్శి పి.రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నరేంద్ర, హసీన్, తదితరులు పాల్గొన్నారు