తెలుగు తేజం, మైలవరం : మైలవరం తెలంగాణా సరిహద్దు గ్రామం అనంతవరం గ్రామ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం స్థానిక సి ఐ పి. శ్రీను, ఎస్ ఐ రాంబాబు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా తెలంగాణా నుండి తీసుకు వస్తున్నా మద్యాన్ని పట్టుకున్నారు. మొత్తం
రూ 2,30,400 విలువగల 1920 బాటిళ్లను, ఒక ట్రక్ ఆటో ను సీజ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఈ బి, ఎస్ పి వకుల్ జిందాల్, నూజివీడు డి ఎస్ పి, బి. శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటివరకు ఉన్న 53 బోర్డర్ చెక్ పోస్టుల కు అదనంగా మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ మద్యం, డబ్బు రవాణా గానీ మరే ఇతర అక్రమాల కు పాల్పడ్డ, తీవ్ర చర్యలు ఉంటాయని మీడియా ముఖంగా హెచ్చరించారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులు అందజేశారు. ముద్దాయిలు కోడె.నరేష్ అనంతవరం(బెల్ట్ షాప్ యజమాని),గొర్రె.సాయిబాబు అనంతవరం,నునావత్ యేసు.కోకిలంపాడు తిరువూరు మండలానికి చెందిన వారిగా గుర్తించారు.