దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పుదుచ్చేరిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేదీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలగించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పార్టీ బలం మెజార్టీ మార్కు దిగువకు చేరడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేదీని తొలగించి తమిళిసైకు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.