తెలుగు తేజం. మోపిదేవి : మండల కేంద్రం మోపిదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 151 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 4 కలర్ మరియు 4 బ్లాక్ అండ్ వైట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోలను అవనిగడ్డ శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తోట శ్యామ్ కిషోర్ నాయుడు ఆర్థిక సహాయంతో గురువారం విద్యార్థులకు అందజేశారు. గత 12 సంవత్సరాలుగా ఈ పాఠశాల విద్యార్థులకు ఫోటోలతో పాటు పలు సేవా కార్యక్రమములు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు వక్తలు ఆయన సేవా నిరతిని కొనియాడారు. అనంతరం ఆయనను దుశ్శాలువలతో. పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల l హెచ్ఎం పి జయంతి. గ్రామ సర్పంచ్ నందిగం
మేరీ రాణి. పాఠశాల పి ఎం సి చైర్మన్ జి నాని బాబు. ఉపాధ్యాయులు కైలా ఉమామహేశ్వరరావు గ్రామస్తులు నందిగం అభిషేక రావు. మోటుపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.