ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇళ్ళకు పరిమితమైన పట్టణ వాసులు
పట్టణ ప్రాంతం అంతా ఎండ తీవ్రతకు నిర్మానుష్య మారిన రోడ్లు
ఒక పక్క కరోనా మరో పక్క ఎండ తీవ్రతతో భయభ్రాంతులకు గురవుతున్న నియోజకవర్గంప్రజలు
ఆరోగ్య శాఖ,మునిసిపల్ అధికారులు కానీ ఎండ తీవ్రత పై కరోనా పై ఎలాంటి జాగ్రత్తలు,అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న ప్రజలు
తెలుగు తేజం, నందిగామ :కృష్ణానది పరివాహక ప్రాంత అయిన నియోజక వర్గం ప్రాంతం మెట్ట ప్రాంతం సుబాబుల్ పంట అధికంగా ఉండటం వల్ల భూమి లో తేమ శాతం తగ్గిపోయి విపరీతమైన వేడి బయటికి ఉత్పన్నమవుతుందని చెట్లు పెంచడానికి నాడు-నేడు కార్యక్రమం లో కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించిన పాలకులకు మాత్రం చెట్లు నాటాలని ఆలోచన లేదని దాని పరిణామమే ఈ ఎండ తీవ్రత అని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చలివేంద్రంలు ఏర్పాటుచేసి మజ్జిగ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు