తెలుగు తేజం,కంచికచర్ల : కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కృష్ణా జిల్లా అర్చక అధికార ప్రతినిధి ఏకాంబరేశ్వర శర్మ, అబ్బూరి వెంకట నాగమల్లేశ్వరరావు ల ఆద్వర్యం లో రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఇంటింటికి తిరిగి 77,570 రూపాయలు విరాళాలను సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఈ 16 రోజులు చేసినటువంటి మహాయజ్ఞంలో, భక్తుల సహాయ సహకారాల కోసం కొత్తపేట గ్రామంలో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగిందని, స్వామివారి జన్మ భూమి, అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం చేసినటువంటి కృషిలో ఎందరో మహానుభావులు బలిదానం పొంది, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా శంకుస్థాపన జరగటం చాలా సంతోషించదగ్గ విషయమని, అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం కొత్తపేట గ్రామంలో గడప గడపకు వెళ్లి వారి శక్తి కొలది చందాలు వసూలు చేసి రామ మందిరం నిర్మాణం లో భాగస్వాములను చేయడం జరుగుతుందని, భక్తులు తమ శక్తి కొలది చందాలు ఇచ్చి స్వామివారి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా శనివారం కొత్తపేట గ్రామంలో భక్తుల ద్వారా విరాళం సేకరించి, ఆ నిధిని రామ మందిరం నిర్మాణం కోసం పంపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అర్చక అధికార ప్రతినిధి ఏకాంబరేశ్వర శర్మ, అబ్బూరి వెంకట నాగమలేశ్వరావు నెమలిపురి గాంధీ, చింత వాసు, ఆర్ యస్ యస్ ప్రచారకులు వాచస్పతి, ఆర్ ఎస్ ఎస్ కార్యదర్శి కర్ల రాంబాబు, వీర్ల జమలయ్య, నెమలపూరి వెంకటేశ్వరరావు,పి. నాగబాబు, వెంకట్రావు,గుదే కాత్యాయని దేవి, పొదిల సాయి, పత్తిపాటి కృష్ణమూర్తి, పత్తిపాటి కృష్ణారావు, పత్తిపాటి నరశింహరరావు,మాల్లది శ్రీనివాస ముర్తి, మరియు గ్రామస్తుల తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.