Breaking News

గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు

తెలుగు తేజం, గొల్లపూడి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు తెలుగుయువత ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మేరకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, నారా లోకేష్ జన్మదిన కార్యక్రమాన్ని గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భాగస్వామ్యం అయ్యారన్నారు. చిన్న వయస్సులో మంత్రివర్యులుగా ఈ రోజు ఎమ్మెల్సీ సభ్యులుగా పంచాయితీ రాజ్ ఐటీ శాఖల మంత్రి రాష్ర్టంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం గ్రామాల్లో సీసీ రోడ్లు, ఎల్ఈడీ బల్బులు అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ లో ఐటీ పరిశ్రమలు తీసుకువాడంలో లోకేష్ పెద్ద ఎత్తున పనిచేసారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంధ కార్యక్రమాలు, బ్లడ్ డోనేషన్ డ్రైవ్ కార్యక్రమాలు, కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నేతలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *