తెలుగు తేజం, జగ్గయ్యపేట : ఎస్. జి. ఎస్ కాలేజ్ నందు జరగబోవు పంచాయతీ ఎలక్షన్స్ దృష్ట్యా ఎన్.ఎస్.ఎస్ సిబ్బంది సేవలను వినియోగించుకొను నిమిత్తం బుధవారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి ఎస్. జి. ఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసాద్ రావు, స్వామి, కిషోర్, జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రశేఖర రావు, మరియు జగ్గయ్యపేట ఎస్సై చిన్న బాబు హాజరయ్యారు. చంద్రశేఖర రావు మాట్లాడుతూ ఎలక్షన్స్ లో నిర్వహించాల్సిన విధులను గురించి తెలియజేయడం జరిగినది. అదేవిధంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా, సామరస్యపూర్వక వాతావరణంలో ఎలక్షన్స్ జరిగే విధంగా డ్యూటీస్ నిర్వహించాలని తెలియజేశారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అని తెలియజేశారు. అనంతరం కాలేజీ యాజమాన్యం సిఐ ని ఎస్సై కి చిరు సత్కారం చేయడం మైనది. ఈ కార్యక్రమంలో కాలేజీ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.