తెలుగు తేజం, చందర్లపాడు : చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నూతన కార్యాలయం వద్ద జెండా దిమ్మెకు భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ బబ్బూరి.శ్రీరామ్ గారి చేతుల మీదుగా జరిగినది. అనంతరం మండల అధ్యక్షుడు పోసాని.గురునాథం గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరామ్ గారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నూతన అధ్యక్షుడిగా తన వంతు సహాయ సహకారాలు అందించి సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని తెలిపారు. అనంతరం వ్యవసాయ బిల్లులపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్.తోమర్ రైతు సోదర సోదరీమణులకు రాసిన బహిరంగ లేఖకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించబడ్డ కాండ్రపాడు గ్రామ సచివాలయం సందర్శించి అక్కడ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు మహంకాళి రామకోటేశ్వరరావు,ఝాన్సీ రాణి, చందర్లపాడు మండల ప్రధాన కార్యదర్శి గొటిక.శివకృష్ణారెడ్డి, బి.సి మోర్చా అధ్యక్షుడు బుడంచర్ల.విష్ణుమూర్తి,ఎస్.సి మోర్చా అధ్యక్షుడు బుల్లిబాబు, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి మండాది. దశరధరామ్(రాము), జడ్పిటిసి అభ్యర్థి బోనం రామిరెడ్డి,చందర్లపాడు గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి కొండ్రు.సాంబశివరావు, నాయకులు సైదుబాబు, కోట.సాంబశివరావు, కమతం.జోగీరెడ్డి మరియు కాండ్రపాడు యువత పాల్గొన్నారు.