తెలుగు తేజం, విజయవాడ : మనసున్న ప్రజానాయకుడు. జనహృదయనేత రాష్ట్ర రవాణా మరియు సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షిస్తూ రవాణాశాఖ ఉద్యోగుల పక్షాన జన్మదిన శుభాకాంక్షలను అందజేస్తున్నటు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు తెలిపారు. సమాచార పౌర సంబంధాలు, రవాణాశాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ డిటిసి కార్యాలయ ప్రాంగణంలో మంగళవారంనాడు ఉద్యోగులు జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జోనల్ అధ్యక్షులు యం రాజుబాబు మాట్లాడుతూ మచ్చలేని నేత, నిగర్వి, ఉద్యోగుల పక్ష పాతి, స్నేహశీలి మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన శైలిలో ప్రజల సమస్యలను పరిష్కరించటంతోపాటు ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో పయనిస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు
చేయడంలో ప్రతిరోజు నిమగ్నమవుతున్న మంత్రి పేర్ని నాని యువప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. ఉద్యోగులకు ఐఆర్. కరువుభత్యం ప్రకటించడంలోనూ, ఉద్యోగులకు నిర్వహించే శాఖాపరమైన పరీక్షలలో నెగెటివ్ మార్కుల విధానాన్ని తొలగించడంలోనూ, రవాణాశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలోనూ మంత్రివర్యులు చూపిన చొరవ ప్రతీ ఉద్యోగి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపియస్ ఆర్ టి సిని ప్రజారవాణా శాఖగా మార్పు చేసిన తక్షణమే
ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఆర్టిసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి 2 లక్షల మంది ప్రజారవాణా సంస్థ ఉద్యోగుల కుటుంబ సభ్యుల గుండెల్లో ఆనందాన్ని నింపారన్నారు. వాహన మిత్ర పధకం అమలు చేయడం ద్వారా లక్ష లాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు స్నేహహస్తాన్ని అందించిన మంత్రివర్యులు పేర్ని నానికి వారు రుణపడి ఉంటారవడంలో అతిశయోక్తి లేదన్నారు. రవాణాశాఖలో మధ్యవర్తుల వ్యవస్థను నిర్మూలించి, రవాణా సేవలలో అత్యంత పారదర్శక విధానం ద్వారా తొలిసారిగా గ్రామ సచివాలయాల ద్వారా రవాణాశాఖ సేవలను ప్రవేశ పెట్టి ప్రజలకు సులభతరం చేశారన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి రవాణాశాఖ ఉద్యోగులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ఆయన సూచించిన విధానాలును పారదర్శకంగా ఆమలు చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలను అందజేస్తున్నట్లు రాజుబాబు తెలిపారు. జన్మదిన వేడుకల్లో సమాచారశాఖ ఏపీఆర్ఓ యం లక్ష్మణచార్యులు పబ్లిసిటీ అసిస్టెంట్, ఏ.పి. ఎన్జివో అసోసియేషన్ నగరశాఖ ఆర్గ నైజింగ్ సెక్రటరీ వి.వి. ప్రసాద్, రవాణాశాఖా ఉద్యోగుల సంఘం నేతలు కెవివి నాగమురళి, కె రామచంద్రరాజు, పి శ్రీను, బి చంద్రశేఖర్, సత్యనారాయణ, జోసెఫ్, ఉద్యోగులు ఉన్నారు.