Breaking News

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్

ఈనెల 31న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్‌
తెలుగు తేజం, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, ఇక తెలంగాణ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ మున్సిపల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. అలాగే ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీత నియామకం అయ్యారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *