తెలుగుతేజం, జగ్గయ్యపేట : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చారు గుండ్ల వెంకట లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ జగ్గయ్యపేట బస్టాండ్ సమీపంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లైమ్ స్టోన్ మైన్స్ ఉద్యోగులు ప్రజా సంఘాల నాయకులకు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలో వాళ్లతో పాటు కొంతసేపు పాల్గొన్నారు. అనంతరం వారి రిలే నిరాహార దీక్షను సాయంత్రం సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ చారు గుండ్ల వెంకట లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదములు చేస్తూ రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఎంప్లాయిస్ కు నిమ్మరసం ఇచ్చి ఈ రోజు దీక్షను విరమింప చేసినారు.