కృష్ణాజిల్లా కేసర టోల్గేట్ వద్ద సిపిఎం సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నేతలను అరెస్టు చేసిన పోలీసులు
తెలుగు తేజం, కంచికచర్ల : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 చట్టలు తీసుకువచ్చి కార్పొరేట్లకు తొత్తులుగా వ్యవహరిస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో వ్యవహరిస్తూ రైతు నడ్డి విరుస్తున్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు రైతులకు కాకుండా కార్పొరేట్లకు దేశ సంపదను దోచి పెట్టే విధంగా ఉన్నాయన్నారు. ఓపక్క దేశవ్యాప్తంగా మార్కెట్ కమిటీలను రద్దు చేసిన ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేసిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రాష్ట్రంలో ఉన్న అధికార వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష టీడీపీ ఎంపీలు మద్దతిచ్చారన్నారు అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతుల నుండి వ్యతిరేకత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనెల 8 న జరిగిన భారత్ బంద్ లో పాల్గొని మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు ఇంతటితో సరిపోదని తక్షణమే రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీలు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొనటంతోపాటు ఆ చట్టాలను ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం అన్ని టోల్గేటు వద్ద ధర్నాలు ఆందోళన చేపట్టామన్నారు . ఓ పక్క కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ వాహనాల నుండి ముక్కు పిండి వసూలు చేసేందుకు టోల్ గేట్లను కార్పొరేట్లకు కట్ట పెట్టిందన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను రవాణా చేసే సమయంలో టోల్ రుసుము వసూలు చేయకుండా ఉండేందుకే ఈ ఆందోళన చేపట్టామనారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసేంతవరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని అన్నారు. అందులో భాగంగా ఈనెల 14న దేశ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనకు పిలుపునిచ్చారు అన్నారు ప్రజలు రైతులు అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటా కళ్యాణ్ ఎస్ఎఫ్ఐ నాయకులు లాల్ సలాం నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వేల్పుల పరమేశ్వరరావు రైతు సంఘం నాయకులు మహా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
నేతల అరెస్టు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కేసర టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేపట్టిన సిపిఎం కాంగ్రెస్ రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు . నందిగామ రూరల్ సి కే సతీష్ ఆధ్వర్యంలో నందిగామ సీఐ కనకారావు కంచికచర్ల వీరులపాడు ఎస్ఐ లు రాస్తారోకో చేపట్టి న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు తో పాటు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోట కళ్యాణ్ సయ్యద్ ఖాసిం లాల్ సలాం కాంగ్రెస్ నాయకులు వేల్పుల పరమేశ్వరులను బలవంతంగా లాగి జీబుల్లోకి ఎక్కించారు. అక్కడ నుండి వారిని వీరులపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.
అడుగడుగునా నిర్బంధం
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపుమేరకు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద ఆందోళనకు బయలుదేరిన సిపిఎం సిపిఐ రైతు సంఘాల నాయకులను పోలీసులు అడుగడునా నిర్బంధించారు. కంచికచర్ల నందిగామ నుండి కీసర టోల్ గేట్ వద్ద కు బయల్దేరిన కార్యకర్తలను కేసర చేరుకోగానే రోడ్డు మీద రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నందిగామ రూరల్ సి కే సతీష్ నందిగామ సీఐ కనకారావు కంచికచర్ల వీరులపాడు ఎస్సైలు అదుపులోకి తీసుకొని కీసర గ్రామంలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో నిర్బంధించారు. రైతు సంఘం జిల్లా నాయకులు చనుమోలు సైదులు చుండూరు సుబ్బారావు సిపిఎం నాయకులు కె గోపాల్ వేల్పుల ఏసోబు మంగళ పూడి సుందర్రావు కట్టా చామంతి సిఐటియు నాయకులు జి హరికృష్ణ రెడ్డి సయ్యద్ ఖాసిం తదితరులను అదుపులోకి తీసుకొని కంచికచర్ల వీరులపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.