విజయవాడ : విజయవాడ, కస్తూరిబాయిపేట లో బుధవారం శ్రీజ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీజ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఫౌండర్ డాక్టర్ డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మా శ్రీజ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్, లాప్రోస్కోప్, గైనిక్ అనుభవం ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారని తెలిపారు. గోల్డెన్ నీఆక్సినియం ప్రక్రియ ద్వారా అత్యధిక వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు. బజాజ్ ఇన్సూరెన్స్ తదితర హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు 24 గంటలు అత్యాధునిక మెరుగైన ఆర్థోపెడిక్ వైద్య సదుపాయాలు అనునిత్యము అందుబాటులో ఉండి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. ఈ సదా అవకాశాన్ని ప్రజలందరూ పరిసర ప్రాంత ప్రజలు వినియోగించవలసిందిగా కోరారు.