Breaking News

ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే లైసెన్స్ రద్దు : ఏసిపి కె జనార్దన్ నాయుడు

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం రామన్నపేట టు పుట్ల గూడెం బల్లకట్టుపై తెలుగు తేజం గతంలో రామన్నపేట బల్లకట్టు బాగోతం అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది .ఈ ప్రత్యేక కథనంపై ఎట్టకేలకు అధికారులు బుధవారం ఈ బల్లకట్టును సందర్శించిన నందిగామ ఏసీపీ k జనార్దన్ నాయుడు పలు సూచనలు చేశారు
ప్రభుత్వం నీయమనిబంధనలను అనుసరించి బల్లకట్టు మరియు పడవలను నడిపేలా చూసుకోవాలని బల్లకట్టు పడవల యాజమాన్యానికి సూచించారు. బల్లకట్టు మరియు పడవల మీద దాటే ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఉండేలా చూసుకోవాలని ఏసిపి జనార్దన్ నాయుడు అన్నారు . అధిక రేట్లతో ప్రయాణికుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని బల్లకట్టు వారు పడవలు తిప్పేవారు ఫిట్నెస్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని అలా లేని పక్షంలో వెంటనే బల్లకట్టు పడవలను సీజ్ చేస్తామని తెలియపరిచినారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ప్రకారం బల్లకట్టు పడవలను నడపాలని రాత్రిపూట బల్లకట్టు పడవలు తిప్పకూడదని యాజమాన్యానికి తెలియపరిచారు అలా తిప్పిన యెడల బల్లకట్టు పడవలను సీజ్ చేస్తామని తెలియపరిచారు
బల్లకట్టు పడవల యాజమాన్యం వారు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ధరల పట్టిక వాహనదారులకు కనపడే విధంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నందిగామ ఏసిపి కే జనార్దన్ నాయుడు రూరల్ సీఐ నాగేంద్రకుమార్ చందర్లపాడు ఎస్సై రామకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *