Breaking News

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే అత్యధిక బిలియనీర్ ఎంపీలు..

ప్రజా సేవకులు.. కుబేరులు..బిలియనీర్లు.. వీరంతా వేరు వేరు కాదు. ఇదంతా గతం ఇప్పుడు వీరిలోనే వారున్నారు. వారిలోనూ వీరున్నారు. మనం మాట్లాడుకుంటున్నది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధుల గురించి కాదు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల గురించి. అవును.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) దేశవ్యాప్తంగా 776 లోక్‌సభ, రాజ్యసభ స్థానాల్లో 763 మంది సిట్టింగ్ ఎంపీల ఆస్తుల విశ్లేషణలో దేశంలోనే అత్యధిక బిలియనీర్లు ఉన్న ఎంపీలు తెలంగాణేనని తేలింది. దేశంలో అత్యధిక బిలియనీర్ ఎంపీలను కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తేలింది. అత్యధిక ఆస్తులు కలిగిన 24 మంది తెలంగాణ ఎంపీల మొత్తం ఆస్తులు రూ. 6,294 కోట్లు అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 36 మంది ఎంపీల మొత్తం ఆస్తులు రూ. 5,427 కోట్లు ఉంటుందని తాజా నివేదికలో తెలిపారు. అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీల వివరాలను చూస్తే మీరు షాక్ అవుతారు. వారి పూర్తి వివరాలను కూడా నివేదికలో తెలిపింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్టు.

వారిలో అత్యంత ధనవంతుడు బీఆర్‌ఎస్ ఎంపీ బండి పార్థ సారధి. ఇతని ఆస్తుల విలువ రూ. 5,300.21 కోట్లుగా తేల్చారు. మొత్తం పార్లమెంట్ సభ్యులలో బండి పార్థసారథి రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన అయోధ్యరామిరెడ్డి రూ. 2,577.75 కోట్లు, ఎస్పీకి చెందిన జయా బచ్చన్ రూ. 1,001.63 కోట్లతో ఉన్నారు.

అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీలు వీరే..
బండి పార్థసారధి రెడ్డి (బీఆర్ఎస్) | తెలంగాణ – రూ. 5,300 కోట్లు
ఆళ్ల అయోధ రామి రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ) | ఏపీ – రూ. 2,577 కోట్లు
పార్టీల వారీగా బిలియనీర్ ఎంపీలు వీరే..
44 శాతం (7గురు) 16 బీఆర్ఎస్ ఎంపీలు కావడం విశేషం
23 శాతం (7గురు) 31 వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు
రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల్లోనే ఈ బిలియనీర్లు ఉండటం విశేషం. తెలంగాణలోని అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి మొత్తం 16 మంది ఎంపీలు ఉండగా వారి వారి ఆస్తులు రూ. 383 కోట్లు. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఎంపీల సగటు ఆస్తులు రూ. 153 కోట్లు అని తేలింది.

16 BRS ఎంపీల సగటు ఆస్తులు : రూ. 383 కోట్లు
31 మంది వైఎస్ఆర్‌సీపీ ఎంపీల సగటు ఆస్తులు: రూ. 153 కోట్లు
దేశంలో రూ.10 కోట్లకు పైగా ఆస్తులున్న ఎంపీలు 84 మంది ఉండగా.. రూ.5-10 కోట్ల ఆస్తులున్న వారు 33 మంది ఉన్నారు. రూ.1-5 కోట్ల ఆస్తులున్న వారు 77 మంది ఉండగా.. రూ.20 లక్షల నుంచి రూ.కోటి ఆస్తులున్న వారు 23 మంది ఉన్నారు. ఆస్తులు తక్కువగా ఉన్న ఎనిమిది మంది ఎంపీలు కూడా మన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *