Breaking News

ఏపీలో రేషన్ బియ్యం డోర్ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం.. మినీ ట్రక్కుల లభ్దిదారుల ఎంపిక పూర్తి..

తెలుగు తేజం, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యం, నిత్యావసర సరుకుల్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్ధకే ఇవ్వడానికి ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందుకోసం ఈ నెల 4న అధికారులు జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి మినీ ట్రక్కులు పొందేందుకు లబ్ధిదారుల జాబితాలను తయారు చేశారు. కాగా ఎంపికైన లబ్ధిదారుల జాబితాలపై జిల్లాల కలెక్టర్లు ఆమోద ముద్ర వేసి ఆయా జిల్లాల ఇన్‏చార్జ్ మంత్రులకు పంపించారు. ఇన్‏చార్జ్ మంత్రి ఆమోదం రాగానే జాబితాను రాష్ట్రస్థాయి అధికారులను పంపించనున్నారు.

అటు రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఆమోదం పొందిన జాబితాను ముఖ్య కార్యదర్శికి పంపిస్తారు. వారి నుంచి అనుమతి రాగానే తిరిగి జిల్లాకు ఈ జాబితాలను పంపనున్నారు. ప్రభుత్వం నియమాల ప్రకారం బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మినీ ట్రక్కులను కేటాయించారు. ఆయా కార్పొరేషన్ల ఈడీలు సంబంధిత బ్యాంకులతో మాట్లాడి ఎంపికైన లబ్ధిదారులకు మినీ ట్రక్కులను కొనడానికి లోన్స్ ఇప్పిస్తారు. ఈ ట్రక్కులను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఇంటింటికీ బియ్యం, నిత్యావసర సరుకుల్ని రవాణాకు మాత్రమే ఉపయోగిస్తారు. లబ్ధిదారుల తరుపున లోన్ రుణాలను 72 వాయిదాల్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేరుగా బ్యాంకులకు చెల్లిస్తుంది. బ్యాంక్ లోన్‏తోపాటు అన్ని ఖర్చులు పోనూ రూ.10 వేల చొప్పున లబ్ధిదారులకు చెల్లించనుంది. కాగా 72 నెలల అనంతరం మినీ ట్రక్కు లబ్ధిదారుని సొంతమవుతుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *