Breaking News

కురగల్లులో అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన NIUA కేంద్ర బృందం మరియు ఏపీ సి.ఆర్.డి.ఎ. అధికారులు

గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కురగల్లులో నిర్మాణం జరుగుతున్న అంగన్వాడి కేంద్రాన్ని ఏపీ సిఆర్డిఏ గ్రూప్ డైరెక్టర్ శర్మదా సిఆర్డిఏ ఇంజనీర్లు ఎన్ ఐ యు ఏ ఆర్కిటిక్ ప్రసన్న దేశాయ్ వారి బృందం గురువారం కుర్రగల్లు
లో నిర్మాణం జరుగుతున్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుండి వచ్చిన టీం నిర్మాణం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఏపీ సి ఆర్ డి ఏ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మూడింటికి సంబంధించిన సిటీ ప్రాజెక్టులో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో మంజూర యున్నదని అందులో భాగంగా కురగల్లు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణంలో ఉందని డి సి డి ఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ పర్యవేక్షణలో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఐసిడిఎస్ మంగళగిరి పరిధిలోని కురగల్లు గ్రామంలో సి ఆర్ డి ఏ మాకు అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని సిడిపిఓ గౌరీ శంకరి తెలిపారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడానికి ఏపీ సి ఆర్ డి ఏ అధికారులు మరియు ఢిల్లీ నుండి వచ్చిన టీం పరిశీలించడం జరిగిందని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *