Breaking News

గోపినేనిపాలెం తండాలో ఘనంగా శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 282వ జయంతి

తెలుగు తేజం, వత్సవాయి : వత్సవాయి మండలంలోని గోపినేనిపాలెం తండాలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 282వ జయంతిని నూతనంగా ఎన్నికైన గోపినేనిపాలెం సర్పంచ్ బాణావతు శ్రీనివాస రావు సేవాలల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు సేవాలాల్ తండా ప్రజలకోసం చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ తండాలలో ప్రజల జీవన మనుగడలో మార్పులకోసం చేసిన కృషి ఎనలేనిది ఆయనను ఆదర్శంగా తీసుకొని అందరం జీవించాలని అన్నారు. ఈ సందర్భంగా తండా ప్రజలు గ్రామ సర్పంచ్ ని సేవాలాల్ గుడి నిర్మించాలని, అందుకుగాను మేమందరం మీకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు భూక్యా సీతారాములు, తండా నాయక్ బాస్కర్, రాములు, లచ్చిరం, హరియ, రామారావు, గోపి, పకీరు, మరియు తండా మహిళలు మరియు యువకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *