Breaking News

టాటా ట్రస్ట్ సహకారం తో సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ స్వచ్చంధ సంస్థ ఆధ్వరంలో బ్యూటీషిన్ శిక్షణ

తెలుగు తేజం , జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు గ్రామంలో యువతులకు టాటా ట్రస్ట్ సహకారం తో సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ స్వచ్చంధ సంస్థ ఆద్వర్యం లో బ్యూటిషిన్ శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మరియు గ్రామ అధ్యక్షులు ముత్తునేని విజయ శేఖర్ మరియు పంచాయతీ ఈ ఓ నరసింహారావు చేతుల మీద ప్రారంభించటం జరిగింది. ముందుగా జగ్గయ్యపేట నియోజకవర్గం సమన్వయకర్త యం. రాజేశ్వరరావు మాడ్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో అనేక మంది యువతి యువకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి జీవనోపాధి కల్పించడం జరిగిందన్నారు. విజయ శేఖర్ మాట్లాడుతూ సెంటర్ ఫర్ పీపుల్స్ వారు మన గ్రామంలో ఈ శిక్షణ నిర్వహించడం చాలా సంతోషం గా బావించాలి అదేవిదంగా మన ప్రాంతంలో వివిధ శిక్షణలు నిర్వహించి అనేక మంది జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈ శిక్షణ మన గ్రామం లో నిర్వహించడం చాలా సంతోషకరం ఈ అవకాశని అందరు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అల్లాబక్షు షేక్ మాట్లాడుతూ మా సంస్థ 2006 నుండి ఫారెస్ట్ ప్రాంతాలలో మరియు రూరల్ ప్రాంతంలో అనేక అభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం సమన్వయ కర్త యం .రాజేశ్వరరావు ,వెంకటేశ్వర్లు ట్రైనర్ రమ్య , స్కిల్ మిత్రలు , యల్లయ్య మాధవరావు,వెంకటేశ్వర్లు మరియు 15 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ 45 రోజులు ఉంటుంది, 15 మంది మహిళలకు అవకాశం ఉందన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *