Breaking News

డెంగ్యూతో చంద్ర‌బాబును చంపేందుకు జ‌గ‌న్ కుట్ర … నారా లోకేష్

అమ‌రావ‌తి : తమ అధినేత చంద్రబాబును అంతం చేసేందుకే ఆయనను అరెస్ట్ చేశారని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆరోపించారు. అమ‌రావతిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అందుకే చంద్రబాబును సైకో జగన్ అరెస్ట్ చేయించారని… జైల్లోనే అంతం చేయడానికే అరెస్ట్ చేయించారనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి, బెయిల్ రాకుండా చేసి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. జైల్లో భద్రత లేదు, దోమలు విపరీతంగా కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటీ వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారిన పడి మరణించాడని అదే విధంగా చంద్రబాబుకు కూడా ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఏం జరిగినే సైకో జగన్ దే బాధ్యత అని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *