Breaking News

తెలుగుదేశం శ్రామికుడు “ఆళ్ళ” కు ఘన సత్కారం.

(గన్నవరం, తెలుగు తేజం ప్రతినిధి):మచిలీపట్నం పార్లమెంటు టిడిపి కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులైన ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు కు ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్న గూడెం గ్రామంలో ఈరోజు ఉదయం గ్రామ కమ్యూనిటీ హాల్ నందు రంగన్న గూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (ఆర్ ఆర్ డి ఎస్ ) ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందన సభ నిర్వహించారు. ఆర్ ఆర్ డి ఎస్ సభ్యులు గ్రామ టిడిపి ఎంపిటిసి అభ్యర్థి, సామాజికవేత్త పుసులూరి లక్ష్మీనారాయణ, గ్రామ సర్పంచ్ శ్రీమతి కసుకుర్తి రంగా మణి నేతృత్వంలో “ఆళ్ళ” ను దుశ్శాలువతో ఘనంగా సత్కరించి గ్రామ ప్రజాప్రతినిధులు పూల బొకే లతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో పుసులూరి లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ గత 32 సంవత్సరాలుగా “ఆళ్ళ” గ్రామములో, మండలంలో, గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసి ఈ ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దారని ఆయన నాయకత్వంలో సమిష్టిగా ప్రస్తుత వైసీపీకి గాలికి ఎదురొడ్డి రంగన్న గూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కసుకుర్తి రంగా మణి ని గెలిపించుకున్నామని, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా గెలవబోతున్నామని తెలిపారు. సర్పంచ్ కసుకుర్తి రంగా మణి మాట్లాడుతూ ఇప్పటివరకు రంగన్న గూడెం లో జరిగిన గ్రామాభివృద్ధికి గోపాల కృష్ణ రావు చేసిన కృషే ప్రధాన కారణమని ఆయనకి భవిష్యత్తులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపిన మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు ప్రసంగిస్తూ దాళవా వరి రైతులు రైతు భరోసా కేంద్రాలు ద్వారా ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇస్తే, వారిని మిల్లర్ల దయాదాక్షిణ్యాల మీద గాలికి వదిలేశారని, ఆరుగాలం కష్టపడి పెళ్ళాం పుస్తులు తాకట్టుపెట్టి పంటలు సాగు చేసే రైతుల బాధలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని, రైతుల నారుమళ్లు కు నీరు వదలకుండా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ ప్రకాశం బ్యారేజి నుంచి మీరు సముద్రం పాలు చేయడం దారుణమన్నారు. చంద్రన్న బీమా తీసివేయడం వలన కరోనా బారిన పడి మరణించిన పేదలకు స్వాంతన లేకుండాపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ప్రతి కరోనా మరణానికి నాలుగు లక్షలు రూపాయల నష్ట పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు ఇచ్చిన అధికార ప్రతినిధి పదవి ద్వారా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను రైతులు, సామాన్య ప్రజల దృష్టికి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వ శ్రీనివాసరావు, ఎస్ఎంసి చైర్మన్ కనకవల్లి యాకోబు, మండల టిడిపి కార్యదర్శి కసుకుర్తి వేణుబాబు, మాజీ సర్పంచ్ మైనేని గోపాలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పుసులూరి పూర్ణ వెంకటప్రసాద్, కసుకుర్తి కృష్ణారావు , కొలుసు శ్రీమన్నారాయణ, దేవరకొండ శ్రీనివాసరావు తెలుగు యువత నాయకులు కసుకుర్తి సుభాష్ చంద్రబోస్, మొవ్వ రామారావు, ఆళ్ల సుధాకర్, కొలుసు రాంబాబు, మందపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *