Breaking News

నందిగామలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కేటాయింపు

తెలుగు .తనందిగామలో కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణాలకు స్థలం కేటాయింపు …*

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత్రికేయులకు ,కుల సంఘాల కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాలకు స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించిన శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

పాత్రికేయులు ,మీడియా మిత్రులు ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందుగా జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు ,ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించిన్నట్లు తెలిపారు ,

అదేవిధంగా నందిగామలో కుల సంఘాల ప్రతినిధులు పలుమార్లు కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాల కోసం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని కలిసి స్థలాలు కేటాయించాలని వినతి పత్రాలు ఇచ్చి ఉన్నారు ,వారికి కూడా కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాల కోసం స్థలాలు కేటాయించిన్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు తెలిపారు ..

ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియలో భాగంగా కేటాయించిన స్థలాలను చదును చేసి ,రోడ్ల నిర్మాణం, ప్లాట్ నెంబర్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుందని ,అతికొద్ది రోజుల్లోనే వారికి అందజేయనున్నట్లు తెలిపారు ..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *