Breaking News

నష్టాల్లో ఉన్నాం మమ్మల్ని ఆదుకోండి : ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్లు

విజయవాడ: గత ఏడు నెలలుగా సినిమా రిలీజ్‌లు లేక నష్టాల్లో కూరుకుపోయామని విద్యుత్‌ బకాయిలు రద్దు చేసి తమను ఆదుకోవాలని థియేటర్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా కోవిడ్‌ నియంత్రణ చర్యలకు లోబడి అక్టోబర్‌ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఫిలిం చాంబర్స్‌లో బుధవారం ఉదయం ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అధ్యక్షుడు కే.ఎస్‌. ప్రసాద్ మాట్లాడుతూ.. ‘బకాయిలు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకా రద్దు కాలేదు.. 

అనేక సమస్యల కారణంగా ఈ నెల 15 న నుంచి థియేటర్లు చేయటం లేదు. మంత్రి పేర్ని నాని గారి తో చర్చలు జరుగుతున్నాయి. మా సమస్యలు పరిష్కరించనంత వరకు సినిమా హాళ్లు తెరిచే పరిస్థితి లేదు. రేపటి నుంచి సినిమా హాళ్లు తెరవకూడదని నిర్ణయించాము’అని కేఎస్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ‘లాక్‌డౌన్‌ సమయంలో సినిమా హాళ్లపైన వేసిన కరెంట్ బిల్లులు రద్దు చేయాలి. మా సమస్యలను చిరంజీవి నాగార్జున గారి సహకారంతో ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లాం’ అని ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల సెక్రటరీ గోరంట్ల బాబు అన్నారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ఆఫ్ కామర్స్ సెక్రటరీ రమేష్  మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లకి కరెంట్ మినిమమ్ చార్జీలు వేశారు. ఒక్కో థియేటర్‌కు ఈ 7 నెలల కాలం లో 4 లక్షల రూపాయలు అవుతుంది.
ఇపుడు ఉన్న పరిస్థితిలో ఒక్కో థియేటర్ ఓపెన్ చేయటానికి 10 లక్షల ఖర్చవుతుంది. కరోనా కారణంగా 500 థియేటర్లు కరెంట్ బకాయిలు కట్టలేదు. నిర్వహణ చార్జీలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం. కరెంట్ ఫీజులు రద్దు చేయండి. డబ్బున్న వాళ్లు కోవిడ్ సమయంలో కరెంట్ చార్జీలు కట్టారు. కట్టలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆక్యుపెన్సీ విషయంలో కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. ప్రభుత్వం మా సమస్య పరిష్కస్తుందని ఆశిస్తున్నా’అని అన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *