Breaking News

ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత

తెలుగు తేజం హైదరాబాద్‌: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజుల క్రితం కిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కాకర్ల సుబ్బారావు సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ప్రముఖ వైద్య ప్రముఖులు కాకర్ల సుబ్బారావు .. భారతీయ వైద్య చరిత్రలో తనకంటూ ఓ పేరుని లిఖించుకున్నారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో గత కొంత కాలంగా చికిత్స పొందుతూ.. నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. కాకర్ల సుబ్బారావు స్వస్థలం ఆంధ్రపదేశ్ లోని కృష్ణాజిల్లా పెదముత్తేవి. 1925లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చల్లపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఆయన మచిలీపట్నం హిందూ కాలేజీలో చదివారు. అనంతరం విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్‌ పట్టా పొందారు. 1951లో హౌస్‌ సర్జన్‌ పూర్తి చేశారు.

స్పెషల్ స్కాలర్ షిప్ తో కాకర్ల సుబ్బారావు ఉన్నత విద్య కోసంఅమెరికా వెళ్లారు. అక్కడ 1955 లో రేడియాలజీ తో స్పెషల్ డాక్టర్ పట్టాను పుచ్చుకున్నారు అనంతరం అమెరికాలోని న్యూయార్క్‌, బాల్టిమోర్‌ ఆసుపత్రుల్లో రెండేళ్లు రేడియాలజీ స్పెషలిస్ట్ గా పనిచేశారు. అనంతరం 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రధాన రేడియాలజిస్టుగా ఉన్నత పదవిని పొందారు. మళ్ళీ 14 ఏళ్ల తర్వాత 1970లో సుబ్బరావు మళ్లీ అమెరికా వెళ్లారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వారి ఫెల్లో ఆఫ్‌ రాయల్‌ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు పట్టా తీసుకుని అక్కడే అనేక ఆస్పత్రిలో పనిచేశారు.

కాకర్ల సుబ్బారావు 1986లో ఎన్టీఆర్ చేసిన విజ్ఞప్తితో స్వదేశానికి పూర్తి స్థాయిలో తిరిగి వచ్చారు. అనంతరం హైదరాబాద్‌ నిమ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. నిమ్స్‌లోని అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోని విధంగా నిమ్స్ లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అభివృద్ధి చేశారు. కాకర్ల సుబ్బారావు తన 50ఏళ్ల వైద్య వృత్తిలో చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బహుమతినిచ్చి సర్కరించింది. అనేక బహుమతులు, సత్కారాలు పొందారు. రేడియాలజీ విభాగంలో అనేక మెడికల్ జర్నరల్స్ ను రాశారు. మానవాళికి, వైద్య సిబ్బందికి ఆయన చేసిన సేవలతో ఎన్నడూ వైద్య చరిత్రలో నిలిచిపోతారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *