Breaking News

ఫిబ్రవరిలో అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుంటే ప్రగతి భవన్ ముట్టడి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, నేషనల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

మేము తెలంగాణ జర్నలిస్టులo…తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన.
తుపాకులకు బదులుగా కలలు వాడినము…పక్కింటి వాళ్ళ చేతిలో పెట్టినం….
చివరకు అక్రిడేషన్ కార్డు కు నోచుకోలేని అభాగ్యులం….
ఇదేనా తెలంగాణ జర్నలిస్టులకు దక్కేది…అడిగేవారే లేరా….
అల్లం నారాయణ ఏం చేస్తుండు…. జర్నలిస్టుల సమస్యలు పట్టవా….

తెలుగు తేజం : హైదరాబాద్:1990 నుండి చిన్న పెద్ద పత్రికల తేడా లేకుండా 1/3 అక్రిడేషన్ సౌకర్యం ప్రభుత్వం మంజూరు చేసింది, అనంతరం 1997 సంవత్సరంలో జిల్లా మండల స్థాయి విలేకరులకు ఉచిత జిల్లా పాసు, 1/3.రాష్ట్ర పాసు ఇచ్చింది,దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్రిడేషన్ సౌకర్యం కల్పించింది, ప్రస్తుతం తెలంగాణ ఉద్యమ పోరాటం లో తెలంగాణ విభజన అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు ఉన్న పాసులను ఊడదీసి చేసి బజారు పాలు చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీ కే దక్కింది, ఇంత ఘనత చేసేదెవరు, ఉన్నవి తొలగించడం తొలగించిన వాటిని మళ్ళీ పెట్టడం ఇదేనా ప్రభుత్వాలు చేసే పనులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి వైన్ షాప్ లు ఓపెన్ చేసింది, కానీ దానిలో ఉన్న లాభాన్ని గుర్తించి లాభాలు గడించే ఎందుకు ముఖ్యమంత్రి ఇలాంటి దందాలను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రస్తుతం జర్నలిజంలో వందలాది పత్రికలు, కేబుల్ ఛానల్, అనుమతి ఉన్న యూట్యూబ్ ఛానల్ ఇన్ని సమాచార శాఖలు అధికారుల కోసం, జిల్లా కలెక్టర్ కోసం, గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది, వీటన్నింటిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చే సలహాదారులు పక్కనే ఉంటారు, నిన్ను చూస్తున్నారు కానీ జర్నలిస్టులు ఎంత బాధ పడుతున్నారు వారికి అక్రిడేషన్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నడైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి తారక రామారావు, హరీష్ రావు వీళ్లకు వినిపించడం లేదా అని జర్నలిస్టులు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు, చివరకు జర్నలిస్టులకు ముదిరితే ఈ ప్రభుత్వము ఉంటే మీ ఊడిపోతేమి అనేటటువంటి భేదభావాలు తప్పకుండా ఏర్పడతాయి, ఇలాంటి సందర్భాలలో ఎన్నో ప్రభుత్వాలు మట్టి ఖర్చు పోయాయి, అలాంటి సంఘటనలు తలెత్తక ముందే ఒక్క జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తే అయిపోతుంది కదా, కేవలం మాకు మొత్తం కావాలి అని కాదు 30 సంవత్సరాల నుండి చేస్తున్న జర్నలిస్టులకు సీనియారిటీని బట్టి మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, నేషనల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది, రోజురోజుకు ప్రభుత్వ మొండి వైఖరి ప్రదర్శిస్తుంటే ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోతే బజారుకి ఎక్కి పెన్ డౌన్ కార్యక్రమాలు చేపట్టి వారం రోజులు వార్తలు రాక పోకపోతే ప్రభుత్వానికి కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పోతుంది, అన్నీ తెలిసిన ముఖ్యమంత్రి ఇది ఎందుకు తెలుసుకోవడం లేదని వ్యవసాయ పొలాల దగ్గర ఉన్న రైతులు కూడా భావించు కుంటున్నారు, జర్నలిస్టులపై ఎంత మొండి పట్టు పట్టాడని ఆందోళన చెందుతున్నారు, మొన్న జరిగిన కార్పొరేట్ ఎన్నికలలో జర్నలిస్టులను పలకరించకుండా ఎన్నికలను జరుపుకున్నారు, అవి ఎలా జరిగాయో మేము బయట పెట్టగలము, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఇళ్లను స్వాధీనపరచుకొని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు, నిజంగా కార్పొరేటర్ల పైన ప్రేమ అభిమానం ఉంటే ప్రజలు ఏది అడగరు, ఇలాంటి పనులు చేయడం తో ఓటు వేసే వారిలో విభేదాలు ఏర్పడి అఖిలపక్ష పార్టీ లో కూడా ఓట్లు వేశారు, ఇలాంటి సమాజంలో తెచ్చుకోవడం అవసరమా…? కానీ ఇందులో కూడా రాజకీయం తెలియని కొంతమంది కార్పొరేటర్ గా ఉండడంతో ప్రభుత్వ స్వప్నను అర్హత లేనివారికి ఇవ్వడంతో రోజురోజుకు టిఆర్ఎస్ పార్టీ మట్టి కరుస్తుంది, ఇప్పటికే తెలంగాణ 33 జిల్లాల లో టిఆర్ఎస్ పరిపాలన గురించి మాటామంతి ముసలోళ్ళు మొదలుపెట్టారు, ఇంతకంటే ఇంకేం జరగాలి, నిరుపేదలు బ్రతికే ఇళ్లను పెత్తనం జూపించి తమ కార్యకర్తలకు ఇవ్వడం సమంజసమా…. ఈ విషయం కల్వకుంట్ల తారకరామారావు తెలిసిందా….తెలిస్తే ఏమంటాడో అది గుర్తు పెట్టుకున్న రా ఇది కూడా తెలియని మీ రాజకీయాలు ఎందుకు పనికిరావు అని స్పష్టం గా తెలుస్తోంది, ఒక కార్పొరేటర్ చేసేపని ఇదే రాష్ట్ర రాజధానిలో ఆరవ తరగతి చదివే విద్యార్థి జిహెచ్ఎంసి కార్యాలయాలలో కి వెళ్లి తమ సొంత పనులు చేసుకొని వస్తుంటారు, ఇది తెలియని మూర్ఖపు పాలకులు అంతా మాకే తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు, ఇదిలా ఉండగా మరో పక్క పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగతి ఎంత వరకు వచ్చిందో మీ అందరికీ తెలిసిందే, ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఉంటేనే బాగుంటుంది, లేని పక్షములో పటాన్చెరు ఎమ్మెల్యే పరిస్థితి మీకు జ్ఞాపకం రావాల్సి వస్తుంది, జర్నలిజం మహిమ అంటే ఎలా ఉంటుందో మీకు ఇంకా తెలియదు, కత్తి కంటే చాలా పదునైనది కలం… అది తెలియని కొంతమంది మూర్ఖులు అర్థం చేసుకోలేక అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు, ఏ గల్లీలలో చూసిన కార్పొరేటర్ లపై వీళ్ళు చేసిన పనులు ఏ ఒక్కటి చక్కగా లేదని వీళ్ల వ్యవహారం త్వరలోనే బట్టబయలు చేస్తామని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు, పై ఆఫీసర్ విలువలు కుంగిపోయే వి డోర్ దగ్గర కూర్చుని అటెండర్ పోగొడతాడు, వచ్చిపోయే వాళ్ల దగ్గర ఐదు పది రూపాయలు తీసుకోవడంతో విలువ అక్కడే తగ్గిపోతుంది, ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు, పనులు తక్కువ ఆమె ఎక్కువ పిల్లలతో ఫోటోలు దించుకొని వాట్సాప్ లో పెట్టి విలేకరులకు పంపిస్తుంటారు, మేము స్వాతంత్రం తీసుకు వచ్చాము అన్నo త సంబరంగా ముసి ముసి నవ్వులు, ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ సౌకర్యం కల్పించకపోతే గల్లీ లీడర్ నుండి ముఖ్యమంత్రి దాకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి, యాదగిరిగుట్ట, మహబూబ్ నగర్ జిల్లాలతోపాటు అన్ని జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులకు అగ్రదేశం కల్పించవలసిన అవసరం చాలా ఉంది,

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *