Breaking News

మోదీకి అమెరికా ప్రసిద్ధ పురస్కారం

వాషింగ్టన్‌: ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘లెజియన్‌ ఆఫ్‌ మెరిట్’ను మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం బహూకరించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రయాన్‌ చేతుల మీదుగా.. మోదీ తరఫున అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు ఈ అవార్డును స్వీకరించారు.

భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన చొరవకుగానూ ఆయనకు ఈ అవార్డు బహూకరించినట్లు ఓబ్రయాన్‌ తెలిపారు. దీంతో ఈ అవార్డు కింద దేశాధినేతలకు ఇచ్చే చీఫ్ కమాండర్‌ హోదా మోదీని వరించింది. మోదీతో పాటు ఈ అవార్డును ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకూ బహూకరించారు. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తుంటుంది.

మోదీకి గతంలోనూ పలు దేశాల ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. 2016లో సౌదీ అరేబియా.. అబ్దులాజిజ్‌ అల్‌ సౌద్‌ అవార్డు, అఫ్గానిస్థాన్‌ నుంచి అమీర్‌ అబ్దుల్లా ఖాన్‌ అవార్డు, సియోల్‌ పీస్‌ ప్రైజ్‌-2018, రష్యా నుంచి ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోజిల్‌ అవార్డు, యూఏఈ నుంచి జాయెద్‌ మెడల్‌ను అందుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *