Breaking News

రైతుల స‌మ‌స్య‌లే జ‌న‌సేన ఎజెండా?

తెలంగాణలో పోటీపై 2 -3 రోజుల్లో నిర్ణయం

అమరావతి : హైదరాబాద్‌ నుంచి మంగళగిరి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ- ఛైర్మన్‌ నాదెం డ్ల మనోహర్‌ తో భేటీ- అయ్యారు. తాజా రాజకీ య పరిస్థితులు, వారాహి విజయయాత్ర ఐదో విడత, జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ-లో చర్చించాల్సి న అంశాలతో పాటు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటు-న్న సమస్యలపై పవన్‌ కళ్యాణ్‌ చర్చించి పలు సూచనలు చేసారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి విజయయాత్ర ఇప్పటివరకూ నాలుగు విడతలు పూర్తయింది. మొదటి విడత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముగించారు. ఇక రెండో విడత విజయయాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించి తణుకు బహిరంగ సభతో ముగించారు.. మూడో విడతలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పవన్‌ పర్యటన కొనసాగింది. నాలుగో విడత వారాహి విజయయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగింది.అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, -కై-కలూరు నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటించారు. మచిలీపట్నం మినహా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పవన్‌ వారాహి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఎక్కడ బహిరంగ సభ జరిగినా స్థానిక అధికార పార్టీ నేతలతో పాటు- సీఎం జగన్‌ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు జనసేన ప్రకటించింది. హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను పవన్‌కు వివరించినట్టు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని పేర్కొంది. మిత్రపక్షమైన భాజపా విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని పవన్‌ దృష్టికి తెలంగాణ జనసేన తీసుకెళ్లింది. నేతల అభిప్రాయాలను విన్న పవన్ కల్యాణ్‌.. జన సైనికుల అభిప్రాయాలకు విలువ ఇస్తానని తెలిపారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని తెలిపారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *