Breaking News

రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి

తెలుగు తేజం, గుంటూరు: మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి  కూమారుడు ఫారుక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్నేహితుడితో కలిసి ఫారుక్ బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా చౌటుప్పల్ మండలం దర్మాజీగుడెం వద్ద ప్రమాదం జరిగింది. చలి కారణంగా బైక్ ఆపి స్వెట్టర్ వేసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫారుక్ అక్కడికక్కడే మృతి చెందారు. స్నేహితుడు ఫయాజ్ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మస్తాన్ వలికి ఏకైక కుమారుడు ఫారుక్. అతడి మరణంతో మస్తాన్ వలీ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *